
జనం న్యూస్ 13 ఏప్రిల్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి గ్రామానికి చెందిన సత్తిగళ్ళ జానకి - లక్ష్మయ్య కూతురు విద్యార్థిని సత్తిగళ్ళ వైశాలి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 1000 మార్కులకు 992 మార్కులు సాధించి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. వైశాలి శ్రీ చైతన్య జూనియర్ కళాశాల తుర్కయంజల్ లో చదివి సాధించిన ఈ అద్భుత ఫలితంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె క్రమశిక్షణ, కష్టపడి చదివే అలవాటు మరియు ఉపాధ్యాయల మార్గదర్శకత్వంవల్ల ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు వైశాలిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు వైశాలి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. 992 మార్కులు సాధించడం ద్వారా వైశాలి తన ప్రతిభను చాటుకుని ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చింది.