
జగిత్యాల జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ 468/470
జనం న్యూస్, ఏప్రిల్ 13, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం
మండలంలో గల వేములకుర్తి గ్రామానికి చెందిన బర్మా అవంతిక నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాల్లో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి తెలంగాణ స్టేట్ కి సెకండ్ ర్యాంకర్ గా నిలిచింది, అంతేకాకుండా జగిత్యాల జిల్లా టాప్ ట్రాకర్ గా నిలిచింది, తెలంగాణ స్టేట్ 2nd ర్యాంకర్ గా వచ్చినందుకు తల్లి తండ్రులు బర్మా మహేష్ రవీన, నారాయణ కళాశాల బృందం, మరియు నిఖిల్ భరత్ స్కూల్ యాజమాన్యం, అలాగే అవంతికకు ఓనమాలు నేర్పిన న్యూ విజన్ స్కూల్ యాజమాన్యం అభినందనలు తెలిపారు