
బిచ్కుంద ఏప్రిల్ 13 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలో ఆచార్య ప్రైవేట్ పాఠశాలను మున్సిపల్ చైర్మన్ సీమా, షేట్కర్ ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ దేశ భవితరాలను తరగతి గదిలో మాత్రమే నిర్మాణం చేయగలమని అంతటి సమర్ధత కలిగిన వారు కేవలం ఉపాధ్యాయులేనని వారు కొనియాడారు. విద్యార్థులు ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగిన కరిగిన కొవ్వొత్తి వలె వెలుగునిచ్చే కాంతి దివ్యలే ఉపాధ్యాయులు అంటూ ఉపాధ్యాయ వృత్తిని గురించి ఆమె ప్రశంసించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

