
జనం న్యూస్ 14 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు భారత రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ కొమ్ముల ప్రవీణ్ రాజ్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ఆయన అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు 'రాజ్యాధికారం' దక్కినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని బాబాసాహెబ్ నమ్మారని గుర్తు చేశారు. "ఎవరు ఎంత వారికి అంత" అనే నినాదంతో, జనాభా ప్రాతిపదికన ప్రతి సామాజిక వర్గానికి అధికారంలో వాటా దక్కాలన్నదే తమ పార్టీ ప్రధాన ఆశయమని స్పష్టం చేశారు.
అంబేద్కర్ అందించిన 'చదువుకో-సమీకరించు-పోరాడు' అనే స్ఫూర్తితో, బహుజనులందరూ ఒకే తాటిపైకి వచ్చి రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బాబాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.