
జనం న్యూస్ ఏప్రిల్ 14,
నేడు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బడుగు బలహీన వర్గాల, ఆశాజ్యోతి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, వారి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన కెవిఎస్ బీమా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఓర్సు భీమరాజు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ ప్రజా ప్రతినిధులు, కూటమి ప్రభుత్వంసీనియర్ నాయకులు పాల్గొన్నారు భీమరాజు మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, సోదరభావం మరియు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాల సాధనలో భాగస్వాములై, నవ భారత నిర్మాణానికి పునరంకితం అవుదాం.అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ చేసిన కృషిని మరువలేనిదని పేర్కొన్నారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు
