
జనం న్యూస్ 14 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జనాభా గణన 2027లో భాగంగా ఈ ఏడాది మొదట ఇండ్ల గణన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం సెన్సెస్ కు సంబంధించి అన్ని మండలాల తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్ లను గుర్తించడమే కాక మండల స్థాయిలో ఈనెల 18 నుంచి సంబంధిత సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను సెల్ఫ్ ఎన్నూమరేషన్ కు ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో సెన్సెస్ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు సంబంధిత చార్జ్ అధికారులతో పాటు సూపర్వైజర్లు, ఎన్నుమరేటర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ టెలికాన్ఫెరెన్స్ లొ అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు జారీ చేయువారు: డీపీఆర్ఓ/జోగులాంబ గద్వాల జిల్లా.