-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
జనం న్యూస్ 14 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:హెూంగార్డులు, పోలీసు సిబ్బంది మరియు ఇతర పోలీసు అధికారులు బస చేసేందుకు విజయనగరం పట్టణం రంజనీ థియేటరు సమీపంలో గతంలో నిర్మించిన ముద్ధాడ గాంధీ మెమెరియల్ పోలీసు డార్మెటరీని, పోలీసు షాపింగ్ కాంప్లెక్స్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 13న ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. వివిధ విధుల్లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి, ఇతర జిల్లాల నుండి జిల్లా కేంద్రానికి విచ్చేసే పోలీసు సిబ్బంది తక్కువ వ్యయంతో వసతి పొందే విధంగా పోలీసు డార్మెటరీని గతంలోనే నిర్మించారన్నారు. ఈ డార్మెటరీలో సిబ్బంది అవసరాలకు తగిన విధంగా డార్మెటరీని మార్పులు చేసేందుకు, మౌళిక వసతులను కల్పించేందుకు చర్యలు చేపడతా మన్నారు. డార్మెటరీలో పోలీసు సిబ్బంది బస చేసేందుకు ఏర్పాటు చేసిన మంచాలు, బెడ్స్, లాకర్స్, ఫ్యాన్లు, టెలివిజన్ సక్రమంగా పని చేస్తున్నది, లేనిది జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పరిశీలించారు.అనంతరం, పోలీసు షాపింగ్ కాంప్లెక్స్, డార్మెటరీ చుట్టూ ఉన్న ప్రాంతాలను, మేడ మీద ప్రాంతాలను, వాష్ రూమ్స్, డ్రైనేజీ మరియు ఇతర మరమ్మత్తులకు చేపట్టాల్సిన పనులను, అంచనా వ్యయంను నిపుణుల సహకారంతో రూపొందించి , ప్రతిపాదనలను తీసుకొని రావాలని రిజర్వు ఇన్స్పెక్టరు (అడ్మిన్) ఎన్. గోపాల నాయుడును ఆదేశించారు. డార్మెటరీకి అనుసంధానంగా ఉన్న షాపులను, వారితో చేసుకున్న అగ్రిమెంటు వివరాలను , ఎప్పటి నుండి వారు షాపుల్లో వ్యాపారాలు సాగిస్తున్నది, సక్రమంగా అద్దె చెల్లిస్తున్నది లేనిది వంటి వివరాల ను అధికారుల ను అడిగి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలుసుకున్నారు.జిల్లా ఎస్పీ వెంట ఎస్బీ సిఐలు ఎవి లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్. గోపాలనాయుడు, ట్రాఫిక్ సిఐ సూరి నాయుడు, ఆర్.ఎస్.ఐ. వర ప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ ఎస్.భాస్కరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.