
జనం న్యూస్- ఏప్రిల్ 14- నాగార్జునసాగర్ టౌన్
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ హరికృష్ణ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేశారు. కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి నర్సింగ్ ఆఫీసర్ కె నిర్మల, ల్యాబ్ టెక్నీషియన్ వీరబాబు ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బందికి మరియు రోగులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ రవి, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ రష్మీ, డాక్టర్ శ్రీనివాస్, నర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.