
జనం న్యూస్ :14 ఏప్రిల్ మంగళవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సిద్దిపేటకు చెందిన మల్లముల కనకయ్య రచించిన కనకధార స్తబకము, భాగ్యశ్రీ శతకం పుస్తకావిష్కరణలు 19 ఏప్రిల్ రోజున హైదరాబాదులోని రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతాయని కవి ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, అవుసుల భాను ప్రకాష్, కంది శంకరయ్య, బండకారి అంజయ్య గౌడ్, వరుకోలు లక్ష్మయ్య, మంచినీళ్ళ సరస్వతీ రామశర్మ, బడేసాబ్ తదితరులు హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించి, హైదరాబాదులో జరిగే పుస్తకావిష్కరణ మహోత్సవంలో సిద్దిపేట జిల్లాకు చెందిన కవులు, రచయితలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. కరపత్ర ఆవిష్కరణలో పుస్తక రచయిత మల్లముల కనకయ్య, ఎన్నవెళ్ళి రాజమోళి, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.