
జనం న్యూస్ ఏప్రిల్ 14,: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండలంలోని అన్ని గ్రామాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మందికి పైగా యువకులు పాల్గొని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్గట్ల మండల కేంద్రంలో సభ ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి ఆశయాలను గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ జిల్లా అధ్యక్షులు కోటగిరి రామ గౌడ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చిట్యాల రాజేష్, జేఏసీ జిల్లా కో-కన్వీనర్ దిబ్బ సుదర్శన్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్ రక్షక్, జిల్లా నాయకులు పడిగెల శోభన్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి సంగెపు ఆనంద్, ఉపాధ్యక్షులు సునీల్, మండల అధ్యక్షులు జుంగల గణేష్, మాజీ అధ్యక్షులు గన్నారపు రాజేశ్వర్, భట్టాపూర్ ఉప సర్పంచ్ దయానంద్, బీసీ నాయకులు రామన్న, నలిన్ పాల్గొన్నారు.
అలాగే అంబేద్కర్ సంఘం పెద్దలు అట్ల పోచయ్య, లక్కం నరసయ్య, చిటుమల పోలింగ్, చిటుమల అమృత్, సుదర్శన్ మరియు వివిధ గ్రామాల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, పెద్దమనుషులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
