జనం న్యూస్ జనవరి 10 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని గోదావరి లో నీరు లేదని పంట పొలాలకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెరువులో కుంటల్లో నీరు పూర్తిగా ఎండిపోయిందని వారం రోజుల క్రితం బీర్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని కలిసి సమస్యను వివరించగా తక్షణమే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్తతో కలిసి రోళ్ళువాగు, కొల్వాయి లిఫ్ట్ ను సందర్శించి గోదావరి పరివాహక ప్రాంత రైతుల పరిస్థితిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి వివరించి 1 టీఎంసీ నీటిని విడుదల చేయాలని విన్నవించుకునీ రైతుల సమస్యలు తీర్చుటకు నీటి విడుదలకు కృషి చేసినందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బిర్పూర్ మండల రైతుల పక్షాన, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట శ్రీనివాస్ , కమునూర్ గ్రామ ప్రజలు, రైతులు ధన్యవాదములు తెలియజేశారు.