
జనం న్యూస్ ఏప్రిల్ 15 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్క పేటలో ఈరోజు
విద్యార్థుల కోసం రోడ్డు భద్రతా అవగాహన సదస్సుఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి విట్టల్ స్థానిక గ్రామ సర్పంచ్ దుర్గాచలం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా యువత నిర్లక్ష్యం వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చిన్నతనం నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.విద్యార్థులు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా కింది అంశాలను వివరించారు:పాదచారుల నియమాలు: రోడ్డు దాటేటప్పుడు ఎప్పుడూ జీబ్రా క్రాసింగ్ మాత్రమే ఉపయోగించాలి.సిగ్నల్స్ అవగాహన ఎరుపు: ఆగండి నారింజసిద్ధంగా ఉండండి ఆకుపచ్చవెళ్లండి నడకరోడ్డుకు ఎప్పుడూ ఎడమ వైపున ఉన్న ఫుట్‌పాత్‌పైనే నడవాలి. హెల్మెట్ సీట్ బెల్ట్ తల్లిదండ్రులతో ప్రయాణించేటప్పుడు వారు హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించేలా విద్యార్థులు ప్రోత్సహించాలి.సెల్ ఫోన్ వాడకం: డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం ప్రాణాంతకమని గుర్తించాలి.ఈ సందర్భంగా మండల విద్యాధికారి స్థానిక సర్పంచ్ గారికి శిరస్త్రాణం అందజేశారు కార్యక్రమం చివరలో విద్యార్థులందరూ "మేము ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటిస్తాము" అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు