
జనం న్యూస్ ఏప్రిల్ 15 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నారీ శక్తి వందన్ అధినియం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలకు ప్రముఖ సంఘ సేవకులు, పారిశ్రామికవేత్త, బిజెపి నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) పిలుపునిచ్చారు. ఎలమంచిలిలో జరుగు బిజెపి పార్టీ జిల్లా మహిళా సభకు అనకాపల్లి నుంచి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో భారీగా జన సమీకరణ చేశారు. సభకు హాజరు కావడానికి వందలాది మహిళలకు బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేశారు. వాహనాలను ప్రారంభించే క్రమంలో అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, బొడ్డేడ నాగేశ్వరరావుతో కలిసి జండా ఊపి ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమ, రాజ్యాధికారం కోసం అనేక అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతం చేశారన్నారు.నారీ శక్తి వందన్ అధినియం అద్భుత కార్యక్రమం ద్వారా మహిళల 33 శాతం రిజర్వేషన్ అంటే మహిళా శక్తికి గౌరవం, మహిళల స్వరానికి బలం, దేశ నిర్ణయాల్లో సముచిత స్థానం కల్పించడమే ధ్యేయంగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నారన్నారు. మహిళా సాధికారతకు మరొక గొప్ప మైలురాయిగా మహిళా శక్తి వందన్ కార్యక్రమం, అని చారిత్రాత్మక నిర్ణయం నారీ శక్తి వందన్ అధినియం కార్యక్రమమని, ఈ చట్టం ద్వారా మహిళలకు 33 శాతము రిజర్వేషన్ కల్పించడం ప్రధానమన్నారు. మోడీ మహిళల కోసం తీసుకుంటున్న ఈ ప్రత్యేక చర్యలతో మహిళల దిశ దశ మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఏపూరి వాసు వాయుబోయిన నర్సింగ్ యాదవ్, గైపూరి రాజు, సీతారామారావు భారీ ఎత్తున మహిళలు, ఎం.వి.ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.//