
జనం న్యూస్ 16 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
దళారులను నమ్మి రైతులు నష్టపోవద్దు అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి, పంట నాణ్యతను పరిశీలించారు. మద్దతు ధరతోనే రైతుకు మేలు,అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు తాము కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకొని నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే రైతులు తమ పంటను విక్రయించుకోవాలని, తద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన కోరారు.రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది,ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో రైతు సోదరులు పాల్గొన్నారు.