
జనం న్యూస్ 16 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి.జి విజయ్ కుమార్
మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు 50 శాతం సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ మహిళా జేఏసీ చైర్మన్ మట్టా జయంతి గౌడ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరింది. హిమాయత్ నగర్లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జరుగుతున్న ఈ దీక్షకు
సంఘీభావం తెలిపిన తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి. జి విజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీ మహిళలకు రాజకీయ అధికారం దక్కకుండా అగ్రవర్ణాలకే లబ్ధి చేకూర్చేలా కేంద్రం బిల్లును తీసుకురావడం అన్యాయమని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఈ పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు సామాజిక న్యాయం జరగాలంటే బీసీ మహిళలకు సబ్ కోటా తప్పనిసరి అని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు మహిళా బిల్లులో బీసీ మహిళలకు 50 శాతం సబ్ కోటా కేటాయించాలి.బీసీ జనగణన చేపట్టి జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ కోటా ఇవ్వాలి..తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ దీక్షను విరమించే ప్రసక్తే లేదని మట్టా జయంతి గౌడ్ మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి.. జి విజయ్ కుమార్ చేశారు..