
జనం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన :
మండలంలోని విబిజి రామ్ జీ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) వారాంతపు సమీక్షా సమావేశం బుధవారం కాట్రేనికోన మండలపరిషత్లో జరిగింది. ఎంపిడిఓ ప్రోగ్రాం అధికారి బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యం వహించారు. ప్రతీ గ్రామంలో ఉపాధి శ్రామికులకు పనులు కల్పించాలని, పని క్షేత్రంలో నీడ, నీరు ఏర్పాట్లు చేయాలని క్షేత్ర సహాయకులను సమావేశంలో ఎంపీడీవో ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సరాసరి వేతనం పెంచే విధంగా తగు చర్యలు చూపాలని సూచించారు. పనులు గుర్తించడంలో నిర్లక్ష్యం వహించరాదని ఆయన హెచ్చరించారు. ఈ సమీక్షలో ఏపివో చంద్రమోహన్, సిబ్బంది పాల్గొన్నారు
