
జనం న్యూస్ ఏప్రిల్ 16 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనిచేస్తున్న వారిని తేనెటీగలు కుట్టడంతో ఎల్కతుర్తి 108 అంబులెన్స్ మరియు ముల్కనూర్ 108 అంబులెన్స్ లో హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు.55సంవత్సరాల వ్యక్తిని ముల్కనూర్ 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విద్యాసాగర్ పైలెట్ సంపత్ గారి సహాయంతో ERCP డాక్టర్ మనీష్ గారి యొక్క సలహాలు సూచనల మేరకు ప్రధమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు.