
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 16 సెల్ 9550978955
ఈనెల 16నుంచి నూతన 2026-27విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పోలిరెడ్డి పాలెం పాఠశాల ఆవాస ప్రాంతం నందు "అడ్మిషన్లు డ్రైవ్ ర్యాలీ" నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి బి.సత్యనారాయణ సింగ్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించి విద్యార్థిని విద్యార్థులు చేర్చుకోవడం జరుగుతుందని అవాస ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాల ఇస్తున్న సౌకర్యాలగురించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉచిత యూనిఫామ్, విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, షూ, బెల్ట్, సాక్స్ పంపిణీ ఇంగ్లీష్ మీడియం లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాబోధన, డిజిటల్ విద్యాబోధన కి పట్ల అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలలో చేరాలని కోరడం జరిగింది కావున విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాలనీ, మదర్ తెరెసా కాలనీ, లక్ష్మీనరసింహ కాలనీ, పోలిరెడ్డిపాలెం,కోండ్రుపాడు ఆవాస ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థులు మున్సిపల్ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందించే సౌకర్యాలు పొందాలని తెలిపారు, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన డిజిటల్ రూపంలో జరుగుతుందని అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన కృత్యా ద్వారా బోధన జరుగుతుందని తెలిపారు, అనంతరం పాఠశాల లో మూడో తరగతి విద్యార్థులకు జరుగుతున్న ఫౌండేషన్ లీటరసి స్కిల్ (FLS )టెస్ట్ పరీక్ష నిర్వహణను పరిశీలించడం జరిగింది,పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ బడి -చదువుల గుడి, ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, ఇంటింటా చదువు- ఊరంతా వెలుగు, బాల కార్మిక వ్యవస్థ -నిర్మూలించండి, పెద్దలు పనికి- పిల్లలు బడికి వంటి నినాదాలు చేశారు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జై హైమావతి ఉపాధ్యాయులు పి శై లజ పోటుశ్రీనివాసరావు జి ఆదిలక్ష్మి కె అరుణ సిహెచ్ నవ్యశ్రీసీఆర్పీ శివ పార్వతి,పేరెంట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు,