
జనం న్యూస్ ఏప్రిల్ 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి
నుంచి అచ్యుతాపురం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చిందని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. ఈరోజు ఉదయం మునగపాక వైసిపి పార్టీ కార్యాలయంలో రోడ్డు నిర్వాసితులనుద్దేశించిరైతులకు టిడిఆర్ బాండ్ల రూపంలో కాకుండా,2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగదు రూపంలోనే నష్టపరిహారం చెల్లించాలి అని హైకోర్టు స్పష్టంగా ఆదేశించిందని, చెప్పారు.అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు పరిధిలో సుమారు 2000 ఎకరాల పంట భూములు ప్రభావితమవుతున్నాయని, ముఖ్యంగా మునగపాక, గంగాదేవిపేట,ఒంపోలు గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.గంగాదేవిపేట జంక్షన్ నుంచి మునగపాక జంక్షన్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యవసాయ భూములు వరద ముప్పుకు గురయ్యే పరిస్థితి నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటివరకు వర్షాకాలంలో పంటలను రక్షించుకునేందుకు రైతులు స్వచ్ఛందంగా సొలోపు కాలువలను మరమ్మతు చేసుకుని,ఆ నీటిని మునగపాక కృష్ణంరాజు కాలువకు చేరేలా చూసుకుంటున్నారని చెప్పారు.అయితే భూ సేకరణ ప్రక్రియ పూర్తికాకుండానే,ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా రోడ్డుకు ఇరువైపులా కాంక్రీట్ గోడల నిర్మాణం చేపడుతున్నారని విమర్శించారు.ఈ కాంక్రీట్ గోడలు నిర్మించబడితే,రాబోయే రోజుల్లో వరదలు సంభవించినప్పుడు పంట పొలాల్లో నీరు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అందువల్ల వెంటనే ఆ నిర్మాణాలను నిలిపివేసి, ముందుగా రైతులకు చట్టప్రకారం నగదు పరిహారం చెల్లించి,భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని బొడ్డేడ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..రైతుల హక్కుల కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ పోరాడుతుందని,బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు_.ఈ కార్యక్రమంలో మునగపాక మండలం జడ్పిటిసి సభ్యులు పెంటకోట సోమ సత్యనారాయణ,మునగపాక మండలం పార్టీ అధ్యక్షులు ఆడారి గణపతి అచ్చియ్య నాయుడు,మూల సంఘం అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, అరబుపాలెం మాజీ గ్రామ సర్పంచ్ బొడ్డేడ శ్రీనివాసరావు,రోడ్డు నిర్వాసితులకు బాధిత, రైతుల తదితరులు పాల్గొన్నారు.//