
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 17
గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా తుమ్మలచెరువు గ్రామంలో మురుగు కాలువల పూడికతీత పనులను చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మ పర్యవేక్షణలో గురువారం గ్రామంలోని పలు వీధుల్లో ఈ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు.
గత కొంతకాలంగా గ్రామంలోని పలు వీధుల్లో మురుగు కాలువలు చెత్తాచెదారం, మట్టితో పేరుకుపోయి మురుగునీరు నిలిచిపోతోంది. దీనివల్ల దోమల వ్యాప్తి పెరిగి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గుర్తించిన కార్యదర్శి పద్మ, తక్షణమే స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో పూడికతీత పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు వలి, అబ్దుల్ పాల్గొన్నారు