
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఏప్రిల్ 16. 04. 2026
తెలంగాణ ఏర్పాటుపై కర్ణాటక బీజేపీ యంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయి ఒక ఎంపీగా ఉండి బాధ్యత మరచి ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరైంది కాదు, తెలంగాణ,ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల విభజనను భారత,పాకిస్థాన్ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అన్ని వర్గాల ప్రజల దీర్ఘకాల పోరాట ఫలితమే,రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రం.తెలంగాణ ఉద్యమాన్ని విద్వేషపూరిత పాకిస్థాన్ విభజనతో పోల్చడం పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్నీ దెబ్బతీసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి,ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండడానికి అనర్హుడు వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణా,ఆంద్రప్రదేశ్ ప్రజలకు క్షమపణలు చెప్పాలని డిమాండ్,