
జనం న్యూస్ ఏప్రిల్ 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని మాందారిపేట ప్రధాన రహదారి పై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఎస్సై జక్కుల పరమేశ్వర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎస్సై మాట్లాడుతూ రోడ్డు భద్రతా సైబర్ నేరాల నివారణ డ్రగ్స్ నియంత్రణ సిసి కెమెరాల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు మండల గ్రామ స్థాయిలో ఉన్న యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వాహన దారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి ఈ కార్యక్రమంలో
పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు…..