
జనం న్యూస్ 17 ఏప్రిల్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో,తెలంగాణ ప్రభుత్వ నేతృత్వంలో చేనేత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా జోగులాంబ గద్వాల జిల్లాలో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆలంపూర్ , గద్వాలలా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు,
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలో చేనేత అన్నలకు ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు మాట్లాడుతూ, చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు అన్నారు,నేతన్న భరోసా కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించే పథకమాని.చేనేత రుణమాఫీ నేతన్నల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా చేపట్టిన రుణాల మాఫీ అని.నేతన్న భద్రత (నేతన్న బీమా) ద్వారా కార్మికుల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించే బీమా పథకమాని.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని, ప్రభుత్వ సమష్టి కృషితో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. జిల్లా స్థాయి అధికారులు పాల్గొని, అర్హులైన ప్రతి నేతన్నకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. తమ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల పట్ల స్థానిక చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
