
జనం న్యూస్ ఏప్రిల్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట మండలం:
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిపథకం కింద కెనరా బ్యాంక్ ఏర్గట్ల బ్రాంచ్ మేనేజర్ రాకేష్ రెడ్డి శుక్రవారంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తడ్పాకల్ విద్యార్థులకు యు పి ఎస్ తో కూడిన 4 కంప్యూటర్లు అందజేశారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూఏర్గట్ల కెనరా బ్యాంక్ గతంలో కూడా సి ఎస్ ఆర్ కార్యక్రమాల భాగంగా 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్ సి/ఎస్ టి బాలికలకు స్కాలర్షిప్లు అందించిందని తెలిపారు.ఈ సహకారం వల్ల పాఠశాలలో డిజిటల్ విద్యా వాతావరణం మరింత బలోపేతం కావడంతో పాటు విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.కెనరా బ్యాంక్ వంటి సంస్థల సి ఎస్ ఆర్ కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ జావీద్ తెలిపారు. అనంతరం పాఠశాల బృందం తరఫున బ్రాంచ్ మేనేజర్‌ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్, రాములు, రవి, నవీన్, భూపతి, ఆనంద్, చక్రపాణి, దేవానంద్ గౌడ్, కృష్ణ ప్రసాద్, స్వప్న, విజయ తదితరులు పాల్గొన్నారు.
