
జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన, నీటి భద్రత సాగునీటి సంఘాల పాత్ర అనే అంశముపై శుక్రవారం కాట్రేని కోన మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించి పిచికారి వ్యవస్థను పంటల్లో ఉపయోగించేలా కార్యచరణ అమలు చేయాలని ఎంపీడీవో రాజేశ్వరరావు సూచించారు. సూక్ష్మ పిచికారి ( మైక్రో ఇరిగేషన్) పద్ధతులను ప్రోత్సహించడం , వివిధ గ్రామాల్లో చెక్ డామ్ లు, ఫారమ్ పాండ్లు నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుచేయడం, జల సంరక్షణ,వర్షపు నీటి సేకరణ కార్యక్రమాలలో ప్రజలను భాగస్వామ్యం చేయట,ప్రోత్సహించడం. వంటి కార్యక్రమాలు చేపట్టాలని నీటి సంఘాల ప్రతినిధులను కోరారు. ఈ విషయంలో నీటి సంఘాల ప్రతినిధులు ముఖ్య భూమిక పోషించాలన్నారు.ఈపనులు అమలు చేయుట వలన గ్రామాలలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుత్పత్తి పెరుగుతుందన్నారు. గ్రామాల్లో సాగునీరు వృధా కాకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత సంఘాలు అధికారులపై ఉందన్నారు. భవిష్యత్తులో నీటి కొరత ఉండే అవకాశం ఉన్నందున ఎప్పటినుండే కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం డిసి అధ్యక్షుడు ఆకాశం శ్రీనివాస్, నీటి సంఘాల ప్రతినిధులు, తాసిల్దార్ రవి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
