
జనం న్యూస్- ఏప్రిల్ 17- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి వాడపల్లి శ్రీధర్ పిలుపుమేరకు బ్రాంచి అధ్యక్షురాలు కిరణ్ కుమారి మరియు కార్యదర్శి రాము ఆధ్వర్యంలో శుక్రవారం రోజున హాజరు సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సి, పెండింగ్ లో ఉన్న 5 డి ఏ లు వెంటనే చెల్లించాలని, కాంట్రిబ్యూటరీ సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా వారి జీతాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రాక్టు ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ జోగిందర్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ అనిత రాణి, డాక్టర్ సోమశేఖర్, వైద్య సిబ్బంది, నర్సింగ్ ఆఫీసర్స్, పారా మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.