
జనం న్యూస్ ఏప్రిల్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో శుక్రవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ విధానంను పునరుద్ధరించాలని ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ టీచర్స్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు శుక్రవారం చిలిపి చెడు మండలం తాసిల్దార్ సహదేవునికి వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పీఆర్పీని అమలు చేయాలని హెల్త్ స్కీమును అమల్లోకి తెచ్చి హెల్త్ కార్డులు అందించాలన్నారు 2004లో నియామకమైన ఉద్యోగులకు ఓ పి ఎస్ అమలు చేయాలని పెండింగ్ బిల్లును డీఎలను విడుదల చేయాలని 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిశీలించాలని కోరారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సునీల్ యుటిఎఫ్ మండల అధ్యక్షుడు మోహన్ యుటీఎఫ్ సెక్రటరీ సత్యనారాయణ వివిధ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు