
మద్నూర్ ఏప్రిల్ 18 జనం న్యూస్
జనగణన మొదటి దశలో భాగంగా ముందుగా జనగణన అధికారులు (ఎన్యూమరేటర్స్) కు శిక్షణా తరగతులు మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల (బాలుర) నందు జనగణన మండల అధికారి & తహసీల్దార్ ఎం డి ముజీబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగణనలో ఎన్యూమరేటర్స్ పాత్ర కీలకం అని, గృహ గణన, గృహ జాబితా తయారు చేయడం చాలా ముఖ్యమైన మొదటి కర్తవ్యం అని చాలా పకడ్బందీగా తప్పులు లేకుండా చేయాలని అన్నారు.మొదటి సారీ పేపర్ వాడకుండా మొబైల్ యాప్ ద్వారానే జనగణన జరుగుతుంది అన్నారు.సహాయ జనగణన మండల అధికారిణి & ఎంపీడీవో రాణి మాట్లాడుతూ గ్రామాలలో ఇండ్ల జాబితా తయారు చేయడంలో, గ్రామ వివరాలు నమోదు చేయడంలో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులు సహకరిస్తారని వారి సహకారంతో తప్పులు లేకుండా జనాభా లెక్కలు తయారు చేయాలని తెలిపారు.మొదటి దశలో ఈ క్రింది విధంగా వివరాలు నమోదు చేస్తారు.ఇళ్ల జాబితా ప్రాంతంలో ఉన్న అన్ని ఇళ్లను గుర్తించి, వాటి వివరాలు నమోదు చేయడం. (గృహ గణన)
ఇళ్ల సంఖ్య, నిర్మాణం, సౌకర్యాలు (నీరు, విద్యుత్, మరుగుదొడ్డి మొదలైనవి) గురించి సమాచారం సేకరించడం.ఈ శిక్షణా శిబిరంలో మండల ఏ ఎస్ ఓ దత్తు, గిర్దావర్ శంకర్, సిబ్బంది రవి, మాస్టర్ ట్రైనర్ లు పాల్గొన్నారు.

