
జనం న్యూస్ ఏప్రిల్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం, ఆశయ సాధనను స్ఫూర్తిగా తీసుకుని నేటి చిన్నారులు, యువత తమ జీవితాల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.స్థానికంగా దళిత సంఘం అధ్యక్షుడు కలమూరి శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ నర్సింగరావు, అడ్వైజర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి రమేష్ విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ ఆలోచనలు కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ఉండేవని, అదే దృష్టితో భారత రాజ్యాంగాన్ని రూపొందించారని వివరించారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ అనే విలువలను ప్రతిష్టించిన అంబేద్కర్ మార్గం నేటి సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, శివకుమార్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, ప్రసన్నకుమార్, నరేందర్, మధు, శేఖర్, శివ, రేష్మ తదితరులు పాల్గొన్నారు.
