
నేటి యువతకు ఆదర్శం సుధారాణి
జనం న్యూస్ ఏప్రిల్ 18 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం సోమక్కపేట గ్రామంలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నటువంటి సుధారాణి టి ఎస్ పి ఎస్ సి నిర్వహించిన అధ్యాపక పరీక్షల్లో పాస్యస్థాయి 13వ ర్యాంకు సాధించిన సుధారాణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో ఆంగ్ల అధ్యాపకురాలిగా సేవలందించిన సుధారాణి గారి వీడ్కోలు సమావేశం సందర్భంగా విద్యాసంస్థ ఆవరణలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు గత సంవత్సరం కాలంగా సుధారాణి విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు సాధించడంలో అలుపెరుగని కృషి చేశారు కేవలం పాఠ్యాంశాలే కాకుండా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారని సహచర అధ్యాపకులు కొనియాడారు మండల విద్యాధికారి అలాగే ప్రధానోపాధ్యాయులు విట్టల్ మాట్లాడుతూ సుధారాణి గారి క్రమశిక్షణ బోధన పద్ధతులు సంస్థకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు అదేవిధంగా సుధారాణి టి ఎస్ పి ఎస్ సి వారు నిర్వహించిన అధ్యాపక పరీక్ష పోటీలో రాష్ట్రస్థాయి ఆంగ్ల భాషలో 13వ ర్యాంకు రావడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయ పరీక్షల్లో ఆరో ర్యాంకు రావడం నేటి యువతకు ఎంతో ఆదర్శమని మండల విద్యాధికారి మాట్లాడారు పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తరఫున ఆమెను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు సుధారాణి మాట్లాడుతూ తన వృత్తి జీవితంలో విద్యార్థుల నుండి పొందిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని ఈ విద్యాసంస్థతో తనకున్న అనుబంధం ఎప్పటికీ గుర్తుండిపోతుందని భావోద్వేగానికి లోనయ్యారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విట్టల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు డి రమేష్ మరియు ఉపాధ్యాయులు అజయ్ కుమార్ యాదవ్ గౌడ్ మోహన్ మహేష్ కుమార్ విజయ విష్ణువర్ధన్ రమాదేవి సంగీత పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు