
జనం న్యూస్ ఏప్రిల్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
రాంబిల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలో రాంబిల్లి మండల పరిధిలోని జడ్.చింతువ పంచాయతీ పరిధిలో గజిరెడ్డిపాలెం గ్రామంలో 136 ఎకరాల్లో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించనున్న రెన్యూ ఫొటోవోల్టాయిక్స్' ప్లాంట్ కు (సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ) శంకుస్థాపన సందర్భంగా 23.04.2026న జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఎలమంచిలి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్, ఎస్పీ కలిసి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, సమావేశ ప్రాంగణం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ప్రాంతాలు తదితర కీలక అంశాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా, ముఖ్యమంత్రి రాకపోకల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా మళ్లించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ శౌర్యా మాన్ పటేల్, అడ్డు రోడ్డు ఇంచార్జి ఆర్డీవో వి.వి.రమణ, పరవాడ సబ్ డివిజన్ ఇంచార్జి డీఎస్పీ బి.మోహనరావు, రాంబిల్లి ఇన్స్పెక్టర్ నర్సింగరావు, ఎలమంచిలి సిఐ ధనుంజయ రావు, ఎస్.బి ఇన్స్పెక్టర్ బాల సూర్యారావు, ఎస్సై నాగేంద్ర మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు