
జనం న్యూస్ ఏప్రిల్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ఆర్టీసీ బస్సు లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు లో పలువురికి తీవ్రగాయాలయ్యాయి మండలం లోని మాందారిపేట స్టేజి వద్ద ఈ సంఘటన జరిగింది అని పోలీసులు తెలిపారు పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో డ్రైవర్ కండక్టర్ తో పాటు ప్రయాణికులకు గాయాలు కావడంతో గాయాపడిన వారిని 108 అంబులెన్స్ లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించరని బాధితుడు ఆర్టీసీ డ్రైవర్ రంగు కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు….