
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 20 సెల్ 9550978955
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.బార్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమానికి నారా చంద్రబాబునాయుడు నాయకత్వం దిశానిర్దేశకమని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమమునకు విచ్చేసిన అతిథులకు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు మదిర నాగేశ్వరరావు మరియు ప్రముఖ న్యాయవాదులు చుక్కపల్లి రమేష్ టి. దుర్గాప్రసాద్ గడీకే కోటేశ్వరరావు ఆనంద్ జూపూడి రంగరాజు తదితరులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి, ముఖ్యమంత్రివర్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు,అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.