
బిచ్కుంద ఏప్రిల్ 20 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం రోజు శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు బసవేశ్వర (రాజుల చౌరస్తా ) వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ సీమ సెట్ కార్ మరియు బిచ్కుంద మఠాధిపతి శ్రీ సోమలింగ శివాచార్య మహారాజు బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు అనంతరం సోమయ్య అప్ప స్వామీ జీ గారికి లింగయ్య సమాజ్ అధ్యక్షుడు రాజు సెట్ శాలువతో సత్కరించారు . స్వామీజీ మాట్లాడుతూ సమాజం పట్ల అవగాహన కల్పించిన మొదటి గురువు బసవేశ్వరుడు అని. బసవేశ్వరుడు జగద్గురువుగా వారు చూపిన మార్గంలో నడుస్తూ సర్వేజనా సుఖినోభవంతు అందరూ బాగుండాలని ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ వారు ఇచ్చిన శాంతి సందేశం పాటించినట్లయితే ఎక్కడ ఉద్రిగత వాతావరణాలు ఉండదన్నారు బచ్వేశ్వరుడి చరిత్ర తెలుసుకొని విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ బసవేశ్వరుడి జీవిత చరిత్ర ఈ తరానికి తేలవలసిన అవసరము ఉందన్నారు.అనంతరం రాజుల చౌరస్తా నుండి బైక్ ర్యాలీ కొత్త బస్టాండ్ కమ్మర్ గుడి గాంధీ చౌక్ శివాజీ చౌక్ నుండి తక్కడపల్లి రోడ్డు గణపతి గుడి వద్ద వీరశైవ లింగయ్య బసవ భవన స్థలం వరకు వెళ్లి అక్కడ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు రాజు సెట్ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో లింగయ్య సమాజ్ అధ్యక్షుడు తో పాటు బిచ్కుంద వీరశైవ లింగయ్య సమాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


