
20 ఏప్రిల్ సోమవారం; జనం న్యూస్ సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
తెలంగాణ సారస్వత పరిషత్ బాలల కథల పోటీలలో సిద్దిపేటకు చెందిన కవి అనిశెట్టి సతీష్ కుమార్ రాసిన కథ "అందరూ చేసిందే చేద్దాం" పర్యావరణ కథ ఉత్తమ కథగా ఎంపిక కావడం జరిగింది. మొత్తం 180 కథలకు గాను పది కథలు ఎంపిక కాగా అందులో సిద్దిపేట జిల్లాకు చెందిన కవి అనిశెట్టి సతీష్ కుమార్ ఉండడం పట్ల సిద్దిపేట కవులు ఉండ్రాళ్ళ రాజేశం, బస్వరాజ్ కుమార్, కోణం పరశురాములు, వర్కోలు లక్ష్మయ్య, బి. సుధాకర్, చిరంజీవి, తిరుపతి, కాల్వ రాజయ్య తదితరులు అభినందనలు తెలిపారు.