
జనం న్యూస్ ; 20 ఏప్రిల్ సోమవారం సిద్దిపేట నియోకికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
తెలుగు భాషా చైతన్య సమితి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేటకు చెందిన మల్లముల కనకయ్య రచించిన కనకధార స్తబకము మరియు భాగ్యశ్రీ శతకం రెండు పుస్తకాలు ఆవిష్కరణ మహోత్సవం రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథి ఆవిష్కర్త ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అభినవ వేమన కనకయ్య యోగివేమన ప్రభావంతో కనకధార స్తబకము, సామాజిక అంశాలతో కవి పండిత ప్రశంసలతో భాగ్యశ్రీ శతకాన్ని రచించారన్నారు. రెండు పద్య గ్రంథాల తెలుగు భాష వికాసానికి చైతన్యానికి దోహదం చేస్తాయన్నారు. అవుసుల భానుప్రకాష్, కంది శంకరయ్య, రామకృష్ణ చంద్రమౌళి, బండకాడి అంజయ్య, లక్ష్మయ్య, మంచినీళ్ళ సరస్వతి రామశర్మ, గంటా మనోహర్ రెడ్డి, రాధాకుసుమ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో కనకయ్య పుస్తకావిష్కరణ జరగడం పట్ల సిద్దిపేట కవులు ఉండ్రాల రాజేశం, బస్వరాజ్ కుమార్, కాల్వ రాజయ్య, కోణం పరశురాములు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.