
రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా మోకా ఆనందసాగర్!
జనం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన : రాజకీయాల్లో
నిలకడ, పార్టీ పట్ల విధేయత, రాజకీయ పరిజ్ఞా నంతో పదునైన వాగ్దాటి ఎప్పటికైనా గుర్తింపు తెస్తాయని మోకా ఆనంద సాగర్ నియామకం మరోసారి నిరూపించింది. కాట్రేనికోన మట్టి నుంచి ఎదిగి, నేడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్ట డం అటు కోనసీమ ప్రాంతంలోనూ, ఇటు దళిత వర్గాల్లోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ దళిత మంత్రిగా, రాజకీయ దిగ్గజంగా పేరుగాంచిన మోకా విష్ణు ప్రసాదరావు వారసుడిగా ఆనందసాగర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేవలం వారసత్వంతోనే సరిపెట్టుకోకుండా, తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా టీవీ చర్చా వేదికల్లో అధికార ప్రతిపక్షం వైసిపి వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ప్రదర్శించే వాగ్ధాటి, పార్టీ శ్రేణుల్లో ఆయనకు 'వాయిస్ ఆఫ్ టిడిపి'గా గుర్తింపు తెచ్చింది అనడంలో సందేహం లేదు. తండ్రి వారసత్వానికి తోడైన వాగ్దాటిగా సాగర్ మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న అవకాశాలు, ఇప్పుడు రాష్ట్ర కమిటీలో ' కార్యనిర్వాహక కార్యదర్శి' హోదాతో ఆయన ముంగిట నిలిచాయి. కేవలం ఇది ఒక పదవి మాత్రమే కాదు, కోనసీమ ప్రాంతంలోని దళిత ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడంలో ఆయనకు అప్పగించిన కీలక బాధ్యతగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీవీ డిబేట్లలోనూ, పత్రికా సమావేశాల్లోనూ వైసిపి విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే నేర్పు ఉన్న మంచి వాగ్దాటిగా అన్ని వర్గాల్లోనూ సాగర్ పేరుతెచ్చుకున్నారు. కాట్రేనికోనతో పాటు కోనసీమ ప్రాంతంలోని సామాజిక సమీకరణలపై పూర్తి అవగాహన. క్షేత్రస్థాయి పట్టును ఆయన సాధించారు. చంద్రబాబు, లోకేష్‌ల నమ్మకమైన నేతగా ముద్ర పడ్డారని పరిశీలకులు భావిస్తు న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్‌లు తనపై పెట్టిన బాధ్యతను, నమ్మకానికి కట్టుబడి పార్టీ మరింత అభివృద్ధికి కృషి చేస్తానని సాగర్ అన్నారు. ఇరువురి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు