జనంని సిద్దిపేట: 14 ఫిబ్రవరి శుక్రవారం; నియోజికవర్గ ఇన్చార్జి;ఫిబ్రవరి 16 ఆదివారం రోజున హరిహరా రెసిడెన్సి సమీపంలో గల లలిత చంద్రమౌళీశ్వర దేవాలయ మాసోత్సవాల్లో భాగంగా అష్టావధాని మారెపల్లి పట్వర్దన్ శతావధానిచే పది అష్టావధానాలతో పాటుగా దేవతామూర్తుల అభిషేకము, అన్నదాన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కలవన్నారు. అష్టావధానం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని, రాష్ట్రస్థాయిలోని కవులు రచయితలు పాల్గొననున్న సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని కవులు, రచయితలు, సాహితీ ప్రియులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు పండరి రాధాకృష్ణ, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు.