
జనం న్యూస్, ఏప్రిల్ 21:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని దొంచందా గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపును రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించి సీజ్ చేసి ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం తహసీల్దార్ మల్లయ్య మాట్లాడుతూ, సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏప్రిల్ 23, 2026 (గురువారం) ఉదయం 11:00 గంటలకు దొంచందా గ్రామ శివారులో గోదావరి నది వద్ద బహిరంగ వేలం ద్వారావిక్రయించనున్నట్లు తెలిపారు.వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 20,000 (ఇరవై వేలు) డిపాజిట్ చెల్లించిపాల్గొనవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ మంది పాల్గొని ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చాలని ఆయన కోరారు.