
జనం న్యూస్ ఏప్రిల్ 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో జరుగనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఆటోడ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్టీవో, ట్రాఫిక్ పోలీ సు వారు పెడుతున్న అక్రమ కేసులు ఆపాలని, ప్రైవేటు ఫైనాన్స్ దోపిడీని అరికట్టాలని, ఆటో డ్రైవర్లకు గండి కొడుతున్న బహుళజాతి కంపెనీలైనా ఓ లా, ఊబర్, రాపిడ్ వంటి యాప్ లో టూ వీలర్లకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని,డిమాండ్ చేశారు. అలాగే ఏఐటీయూసీ రాష్ట్ర మహా సభలో ఆటో&మోటార్ డ్రైవర్స్ సమస్యలపై చర్చించనున్నట్టు వెల్లడించారు. భవిష్యత్ కార్యాచర ణకు ఈ మహాసభ వేదికకానున్నదని. ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఫెడ రేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి లు పెద్దిరెడ్ల నాగేశ్వరరావు, కోరిబిల్లి జగదీష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల వాహన మిత్ర పధకం అములు చేయాలని, ఎన్నో సంవత్సరాలుగా పోరాడు తున్న పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అనకాపల్లి లో ఆటో లు నిలుపుదల కు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. . కార్య క్రమంలో ఆటో యూనియన్ నాయకులు కె.రామకృష్ణ, కె. అప్పలరాజు, జై. చంద్రరావు, మాలి బాబు, త్రినాధ్, జగదీష్ శ్వరరావు, కొండ బాబు, తదతరులు పాల్గొన్నారు.