
జనం న్యూస్, ఏర్గట్ల, ఏప్రిల్ 21: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల
మండలంలోనితొర్తి గ్రామానికి చెందిన రైతులు గ్రామంలోని డ్రైనేజీ నీరు తమ పంట పొలాల్లోకి చేరి నష్టం కలిగిస్తున్నదని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ శ్రీ అభిగ్యాన్ మాలవ్యా గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. రైతుల పంట పొలాలు, డ్రైనేజీ ప్రవాహాన్ని పరిశీలించి సంబంధితఅధికారులతో చర్చించారు.రైతులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల అభిప్రాయాలను తెలుసుకున్న ఆయన, పరస్పర సహకారంతో సమస్యను త్వరితగతిన పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య,ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ, ఎంపీవో, ఇరిగేషన్ ఏఈ, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.