
జనం న్యూస్ ;22 ఏప్రిల్ బుధవారం ; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్ వారు మే 4న నిర్వహిస్తున్న బాలసాహిత్య సమ్మేళన కార్యక్రమంలో సిద్దిపేటకు చెందిన బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశంకు బాలసాహితీ మిత్ర అవార్డుతో పాటుగా జ్ఞాపిక, ఐదువేల రూపాయల నగదు అందజేస్తున్నట్లుగా తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జే. చెన్నయ్య తెలిపారు. రెండు దశాబ్దాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటుగా రాష్ట్రస్థాయిలో వివిధ బాలసాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాలలచే రచనలు చేయించి పుస్తక రూపంలో అందించినందుకు గాను జాతీయస్థాయిలో బాలసాహితీమిత్ర అవార్డు అందిస్తున్నట్లు తెలిపారు. రాజేశం బాల సాహిత్యంలో సుమారు 15 పుస్తకాలు రచించడం జరిగింది. రాష్ట్రస్థాయిలో అనేక సత్కారాలు, అవార్డులు పొందిన రాజేశంకు ఈ అవార్డు ఎంతగానో ప్రత్యేకమైనది. తాను బాలసాహిత్యంలో చేస్తున్న కృషిగాను జాతీయ స్థాయిలో పురస్కారం రావడం పట్ల రాజేశం హర్షం వ్యక్తం చేస్తూ, తనకు వెన్నంటి నిలిచి అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్న కవులు రచయితలు ఆత్మీయులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.రాజేశం స్వస్థలం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది. తెలుగు భాష ఉపాధ్యాయులుగా మెదక్ జిల్లాలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేలీ ఘనపూర్ మండల కేంద్రం నందు పనిచేస్తున్నారు..