
జనం న్యూస్ ఏప్రిల్ 22 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాంబిల్లి మండలంలో జెడ్. చింతవ పంచాయతీ పరిధిలో గజ్జిరెడ్డిపాలెం లో4000 వేల కోట్లతో ఏర్పాటు చేసే రెన్యూ ఫోటో వాల్టాయిక్స్ సోలార్ ప్లాంట్ పరిశ్రమకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న సమావేశానికి ఈరోజు రాంబిల్లి మండలంలో జన సమీకరణకు కార్యకర్తలు నాయకులతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో రాంబిల్లి మండలం నకు పర్యవేక్షణగా నియమించారని, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు తెలియజేశారు. ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లాలం కోడూరు లాలం భరత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో నాగ జగదీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కార్యక్రమానికి రాంబిల్లి మండలం నుండి 2400 మంది సభ్యులను హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, వీరిని తరలించడానికి 60 బస్సులు ఏర్పాటు చేశారని, తెలుగుదేశం జనసేన బిజెపి సమన్వయంతో ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయాలని నాగ జగదీష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి రంగనాయకులు జనసేన పార్టీ మండల అధ్యక్షులు నూకన్నదొర భారతీయ జనతా పార్టీ నాయకులు కారే రాముడు దిన్ బాబు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.