
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955
ప్రభుత్వ సహాకారముంటే ఒంగోలు జాతిగిత్తల పోషణకు ఆదరణ పెరుగుతుంది.
తాను వ్యవసాయమంత్రిగా ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఎడ్లపందేలపై ఉన్న నిషేధం తొలగించాం : ప్రత్తిపాటి.ప్రత్తిపాడులో జరిగిన ఎడ్లపందేల్లో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ప్రత్తిపాటి.ఎడ్ల పందేలకు లభిస్తున్న ప్రజాదరణ మరే పోటీలకు ఉండదని, రైతులు అమితంగా ఇష్టపడే వ్యాపకాల్లో ఒంగోలు గిత్తల బలప్రదర్శన పోటీలు ఒకటని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు నూతలపాటి పరమేశ్వరరావు మెమోరియల్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో జరుగుతున్న జాతీయస్ధాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలకు ప్రత్తిపాటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఏపీఐఐసీ ఛైర్మన్, టీడీపీ నాయకులు మంతెన రామరాజుతో కలిసి పందేల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు ప్రదానం చేసిన అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు.తాను వ్యవసాయమంత్రిగా ఉన్నప్పుడే ఎండ్లపందేలపై ఉన్న నిషేధాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో తొలగించడం జరిగిందని ప్రత్తిపాటి తెలిపారు.ఎడ్లపందేలకు ప్రభుత్వ సహకారంపై ముఖ్యమంత్రితో మాట్లాడతాం
ఎడ్లపందేలకు ప్రభుత్వ సహాయ సహకారాలు లభిస్తే, ఒంగోలు జాతి గిత్తల పోషణకు మరింత ఆదరణ లభిస్తుందని, ఎంతోమంది ఎడ్ల పెంపకంపై మక్కువ చూపుతారని ప్రత్తిపాటి చెప్పారు. ఈ అంశాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ప్రత్తిపాటి సభాముఖంగా తెలియచేశారు. ఎడ్లపందేలతో పాటు. తెలుగుప్రజలు ఇష్టపడే నాటికలు, నాటకాల ప్రదర్శనకు కూడా ప్రభుత్వం చేయూత అందించేలా చూస్తామన్నారు. ఎప్పుడు, ఎక్కడ ఎడ్ల పందేలు నిర్వహించినా, రైతాంగం భారీసంఖ్యలో హాజరవుతారని, చివరివరకు పోటీలను కళ్లార్పకుండా చూస్తారని ప్రత్తిపాటి చెప్పారు.
స్వర్గీయ ఎన్టీఆర్ స్మృత్యర్థం. పరమేశ్వరరావు కుమారులు అమర్, త్రిలోక్ లు ప్రజాహిత కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని, వారి నేతృత్వంలో జరుగుతున్న ఎడ్ల పందేలకు రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.