
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 22 సెల్ 9550978955
నరసరావుపేట మున్సిపాలిటీలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది.పట్టణ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించే సేవల మెరుగుదలపై ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. నరసరావుపేటలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించగా, ఆ దిశగా కృషి చేస్తానని కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు.పట్టణ అభివృద్ధికి సంబంధించి సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.