
బిచ్కుంద ఏప్రిల్ 23 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో గురువారం రోజు ప్రొద్దుతిరుగుడు (సన్ఫ్లవర్) కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు , కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ప్రారంభించారు.ప్రభుత్వం రైతులకు మద్దతుగా క్వింటాలుకు రూ. 7,721/- కనీస మద్దతు ధర (MSP) నిర్ణయించడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకువచ్చి అమ్ముకోవాలని సూచించారు. రైతులకు న్యాయమైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శంకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ మార్కెట్ కమిటీ సెక్రెటరీ రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు( వాజిద్ నగర్ సర్పంచ్) గోపాల్ రెడ్డి పటేల్ డెలికేట్ విట్టల్ రెడ్డి వెంకట్ రెడ్డి కౌన్సిలర్ నౌషా నాయక్ ప్రేమ్ సెట్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ అగ్రికల్చర్ ఏడి సొసైటీ సి ఓ శ్రావణ్ కుమార్ చింతల్ హనుమాన్లు నాగనాథ్ మరియు కార్యకర్తలు, ప్రజలు రైతులు మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
