అచ్యుతాపురం,14 ఫిబ్రవరి2025(జనం న్యూస్): అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామంలో 13వ తేదీన విద్యుత్ తీగల నుంచి మంటలు వ్యాపించడంతో రైతులు ట్రాక్టరు,నాలుగు వరి కుప్పలు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ సర్పంచ్ దొడ్డి వెంకటకృష్ణ,ఖాజీపాలెం సర్పంచ్ పిల్లా నర్సింగరావు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు