
(జనం న్యూస్ ఏప్రిల్ 24 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్)
నేటి సమాజంలో వెలకట్టలేని ఆస్తి విద్య మాత్రమేనని అలాంటి విలువైన విద్యను మన పిల్లలకు అందించేందుకు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కృషి చేయాలని అప్పుడే సమసమాజ నిర్మాణం జరిగి కుల మత వర్గ తారతమ్యాలు ఎక్కువ తక్కువ అనే బేదాభిప్రాయాలు తొలగిపోయి మన పల్లెలు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్థానిక తహసీల్దార్ సరిత అన్నారు, గురువారం మండల కేంద్రంలోని స్థానిక సాయి గాయత్రి విద్యాలయనందు నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా పాఠశాల నందు నిర్వహించిన పరీక్షల్లో మరియు ఆటల్లో పాటల్లో వివిధ కార్యక్రమాలలో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు ఆమె సర్టిఫికెట్లు మరియు బహుమతులు ప్రధానం చేశారు, అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమెమాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి ప్రతిభ మాత్రమే కొలమానం అని విద్యార్థిని విద్యార్థులు , ఆటల్లో పాటల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో చదువుల్లో అన్ని రంగాలలో ముందుండాలన్నారు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వీలైనంతవరకుతమ యొక్క పిల్లలకు సామాజిక మాధ్యమాలు, టీవీలు సెల్ ఫోన్ లకు దూరంగా ఉంచేందుకు కృషి చేయాలని తమ యొక్క చదువుల్లో సమాచారాన్ని విజ్ఞానాన్ని పెంచుకునేందుకుకు మాత్రమే సెల్ ఫోన్ ని వినియోగించాలని అదేవిధంగా, పిల్లలపై ఒత్తిడి లేని చదువుని అందించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆమె సూచించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్, ఉషారాణి, ప్రభాకర్ రెడ్డి, మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.