
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్. 24 మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని లింగారెడ్డి కాలనీలో గల స్థానిక పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విజయవంతంగా అమలు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM) షేక్ మౌలాలి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. అకడమిక్ క్యాలెండర్లో భాగంగా విద్యా కార్యక్రమాలు, లెర్నింగ్ అవుట్‌కమ్స్, నో బ్యాగ్ డే, ముఖ్యమైన దినోత్సవాలు, gfln కార్యక్రమం, టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ వంటి పలు గుణాత్మక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి దృష్ట్యా అన్ని అంశాలను సమన్వయంతో అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన 7 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే విద్యా సంవత్సరంలో విద్యార్థులు మరింత ఉత్సాహంతో పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అదేవిధంగా పాఠశాలలో బోధించే మంచిమాటలను అలవర్చుకుని, వినయ విధేయతలతో సమాజంలో బాధ్యతాయుతమైన ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అకడమిక్ క్యాలెండర్ విజయవంతంగా అమలు కావడానికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులకు ఈ సందర్భంగా హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు.