
జనం న్యూస్ ఏప్రిల్(24) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శుక్రవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పి సి ఘోష్ కమిషన్ నివేదిక అంతా తప్పుల తడక అని,ఈ రిపోర్ట్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై మరియు మాజీ మంత్రి హరీష్ రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని అన్నాడు. హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్ర బయటపడిందని అన్నారు. కెసిఆర్,హరీష్ రావు లను బదనం చేసేందుకే కమిషన్ వేసి ప్రజాధనం లూటీ చేశారని వారు అధికారంలోకి రావడానికి ఇచ్చిన తప్పుడు వాగ్దానాలు అమలు చేయలేక ప్రజలను మభ్యపెట్టి కాలయాపన చేసేందుకు కమిషన్ వేశారని అన్నారు. ఇలాంటి తప్పుడు కమిషన్లు, కేసులు వేస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని వేదిస్తూ రెండున్నర ఏండ్లు గడిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గోపగాని రమేష్,తడకమల్ల రవికుమార్,నాగమల్లు,గ్రామ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్, నల్లబెల్లి వెంకటేష్,కొండగట్టు వెంకటేష్,బొజ్జ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.